Monday, December 23, 2024

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్నాటకలో అల్లర్లు: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు పెచ్చుమీరిపోతాయని, అల్లర్లతో రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. తెర్దాల్‌లో ఒక ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని చేపడితే అభివృద్ధి తిరోగమన దిశలో పయనిస్తుందని అన్నారు.

ప్రజలు రాజకీయ సుస్థిర కోసం బిజెపిని గెలిపించాలని ఆయన కోరారు. నూతన కర్నాటక సాధన దిశగా రాష్ట్రాన్ని బిజెపి నడిపిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని, బుజ్జగింపు రాజకీయాలు ఉంటాయని ఆయన అన్నారు. మే 10న జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిమిత్తం రెండు రోజులు అమిత్ షా పర్యటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News