Wednesday, December 4, 2024

యుకెలోని లీడ్స్‌లో అల్లర్లు… వాహనాలకు నిప్పుపెట్టిన ఆందోళనకారులు

- Advertisement -
- Advertisement -

లండన్: యుకెలోని లీడ్స్ ప్రాంతంలో అల్లర్లు చెలరేగాయి. నిరసనకారులు పలు వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు డబుల్ డెక్కర్ బస్సుకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులు భారీగా చేరుకోవడంతో పోలీసులు చేతులెత్తేశారు. పోలీసు వాహనాన్ని బోల్తా పడేశారు. లీడ్స్‌కు కిలో మీటరు దూరంలో ఉన్న సిటీ సెంటర్‌లో అల్లర్లు ప్రారంభమయ్యాయి. సిటీ సెంటర్‌లో ఓ కుటుంబం నుంచి నలుగురు పిల్లలను సోషల్ సర్వీసెస్ సిబ్బంది తీసుకెళ్లడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. జనం భారీ సంఖ్యలో సిటీ సెంటర్‌ కు చేరుకోవడంతో ఘర్షణలు అదుపుతప్పాయి. పోలీసులు అక్కడి చేరుకున్న వారిపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. అదనపు బలగాలు మోహరించిన పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. ప్రజలు సంయమనం పాటించాలని హోమంత్రి కూపర్ ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. వదంతులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని పోలీసులు ప్రజలను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News