Thursday, January 23, 2025

కెనడాలో రిపుదామన్ సింగ్ కాల్చివేత

- Advertisement -
- Advertisement -

Ripudaman Singh was shot dead in Canada

కనిష్కవిమాన పేలుడు కేసులో నిర్దోషి

మాంట్రియల్ : కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో రిపుదామన్ సింగ్ మాలిక్‌ను గుర్తుతెలియని వ్యక్తులు రివాల్వర్‌తో కాల్చిచంపారు. 1985 ఎయిరిండియా బాంబు కేసులో నిర్దోషిగా నిరూపితం అయిన సింగ్‌ను అక్కడి సర్రె ప్రాంతంలోగురువారం హత్య చేశారని స్థానిక వార్తాసంస్థలు శుక్రవారం తెలిపాయి. సింగ్‌ను టార్గెట్‌గా చేసుకునే ఫక్కా వ్యూహంతో దుండగులు కాల్పులకు దిగినట్లు భావిస్తున్నారు. 1985లో జూన్ 23వ తేదీన ఎయిరిండియా విమానం ఎంపరర్ కనిష్క ఢిల్లీ నుంచి మాంట్రియల్‌కు వెళ్లుతుండగా పేలుడు సంభవించి 329 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఈ కేసులో మాలిక్ , ఇందర్‌జిత్ సింగ్ రేయాత్, అజైబ్ సింగ్ బగ్రీలు నిందితులు అయ్యారు. కేసు విచారణ క్రమంలో రిపుదామన్ సింగ్ మాలిక్ పాత్ర ఏమీ లేదని నిర్దోషిగా తేల్చారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాంట్రియల్ నుంచి రిపుదామన్ సింగ్ భారత ప్రధాని మోడీకి ఓ లేఖ రాశారు. భారత్‌లో సిక్కుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యల పట్ల ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ ఏడాది మే నెలలోనే రిపుదామన్ సింగ్ భారత్‌లో పలు ప్రాంతాలలో యాత్రకు వెళ్లి కెనడాకు తిరిగి వచ్చారు. ఆయన హత్య పట్ల భారత్‌లోని పలు దేశాలలోని సిక్కు సంస్థలు ఖండన వెలువరించాయి. ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News