హైదరాబాద్: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టకు డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐఎల్‌టి 20 లీగ్‌లో ఢిల్లీ ఫ్రాంచైజీ తరుపున వార్నర్ ఆడుతున్నారు. టీమిండియా వికెట్ కీపర్, స్టార్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ ఈ ఐపిఎల్‌లో ఆడుతాడా? లేదా అనే మీమాంసగా మారింది. దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్ అధికారి సాగర్ వెల్లడించారు. పంత్ వేగంగా కోలుకుంటున్నాడని, తప్ప వచ్చే ఐపిఎల్ ఆడుతాడని స్పష్టం చేశారు. టాప్ ప్లేయర్ జట్టులో ఉండే తమకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. కోచ్‌లు, ఫిజయోల పర్యవేక్షణ కఠిన శిక్షణలు తీసుకుంటుడంతో ఫిట్‌నెస్ సాధిస్తాడు అనే నమ్మకం తమకు కలిగిందన్నారు. హ్యారీ బ్రూక్, జె రిచర్డ్ సన్, షై హోప్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లను తీసుకున్నామని, దేశీయ స్థాయిలో రాణించిన కుషాంగ్రాను కూడా తీసుకున్నామన్నారు. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో తమ జట్టు విజయాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి పూర్తిగా కోలుకున్న విషయం తెలిసిందే. పూర్తిగా ఫిట్ నెస్ సాధించి.. ఆటపై దృష్టి పెడితే జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని క్రికెట్ పండితులు చెబుతున్నారు.
ఐపిఎల్‌కు మరో ఐదేళ్ల వరకు టాటా గ్రూపే స్పాన్సర్ షిప్ హక్కులను దక్కించుకుంది. ఐపిఎల్ స్పాన్సర్ షిప్ హక్కులను 2028 వరకు కొనసాగుతున్నట్టు సమాచారం. రెండేళ్ల కాల వ్యవధికి వివొ నుంచి ఐపిఎల్ హక్కులను టాటా తీసుకున్న సంగతి తెలిసిందే.