Thursday, November 21, 2024

పంత్ ఔట్.. కివీస్‌కు టర్నింగ్..

- Advertisement -
- Advertisement -

29 పరుగులకు అయిదు వికెట్లు కీలక కోల్పోయి ఓటమి దశగా సాగుతున్న టీమిండియాను తన వీరోచిత పోరాటంతో పంత్ భారత శిబిరంలో గెలుపు ఆశలు రేకెత్తించాడు. 57 బంతుల్లో 64 పరుగులు చేసి భారత్‌ను విజయతీరాలకు చేర్చుతున్న క్రమంలో పంత్ ఔట్ తీవ్ర నిరాశను మిగిల్చింది. తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో వన్డే తరహాలో బ్యాటింగ్‌తో జోరుమీదున్న పంత్.. అజాజ్ పటేల్ వేసిన బంతిని ముందుకు వచ్చి డిఫెన్స్ ఆడాడు. బంతి ప్యాడ్‌కు తాకి గాల్లోకి లేచింది. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ క్యాచ్‌ను అందుకుని ఔట్ అంటూ అపీల్ చేశాడు.

ఫీల్డ్ ఆంపైర్ నాటౌట్ అని ప్రకటించాడు. అయితే న్యూజిలాండ్ రివ్యూకి వెళ్లింది. సమీక్షలో థర్డ్ అంపైర్ అల్ట్రాఎడ్జ్‌ను ఆధారంగా చేసుకుని పంత్‌ను ఔట్‌గా ప్రకటించాడు. అయితే అల్ట్రా ఎడ్జ్ రీడింగ్ చూపించే సమయంలో పంత్ తన బ్యాటును ప్యాడ్‌కు తాకించాడు. దాంతోనే అల్ట్రాఎడ్జ్ అలా చూపిస్తుందని పంత్ మైదానంలో అంపైర్లకు వివరించాడు. మరోవైపు థర్డ్ అంపైర్ బంతి గమనాన్ని బట్టి జౌట్‌గా నిర్ణయించాడు. దీనిపై నెటిజన్లు పలువిధాలుగా కామెంట్ చేస్తున్నారు. అల్ట్రాఎడ్జ్ రీడింగ్‌లో బ్యాటుకు -బంతికి గ్యాప్ ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. పంత్ నాటౌట్ అని ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు జట్టును విజయతీరాలకు చేర్చకుండానే ఔటయ్యాననే బాధతో పంత్ కన్నీళ్లతో క్రీజు వదిలి పెవిలియన్ చేరాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News