Sunday, December 22, 2024

హనుమాన్ గా రిషబ్ శెట్టి.. జై హనుమాన్ న్యూ పోస్టర్ రిలీజ్

- Advertisement -
- Advertisement -

పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్ తర్వాత మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ జై హనుమాన్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతులు కలిపారు. ఈ ఎక్సయిటింగ్ న్యూ ప్రాజెక్ట్‌లో నేషనల్ అవార్డ్ విన్నర్ రిషబ్ శెట్టి లీడ్ రోల్ పోషించనున్నారు. రిషబ్ శెట్టి కాంతార తో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడంతో, ఈ కాంబినేషన్ లోని చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది.

ఈ డైనమిక్ కాంబినేషన్ కోసం అభిమానులు, సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా హనుమాన్ గా నటించే నటుడిని రివిల్ చేయడంతో పాటు, చిత్ర నిర్మాతలు బ్రెత్ టేకింగ్ ఫస్ట్-లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్‌లో రిషబ్ శెట్టి హనుమంతునిగా పవర్ ఫుల్ పోజ్ లో, శ్రీరాముని విగ్రహం చేతిలో భక్తిపూర్వకంగా పట్టుకొని అతని పాదాల మీద కూర్చొని కనిపించారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జై హనుమాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)లో భాగం. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని మ్యాసీవ్ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News