Thursday, January 23, 2025

కాంతారా చాప్టర్ 1: పరశురాముడి గెటప్ లో రిషబ్ శెట్టి అదుర్స్!

- Advertisement -
- Advertisement -

హోంబలె ఫిల్మ్స్… భారీ సినిమాలు తీసి, అంతకంటే భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్న సినీ నిర్మాణ సంస్థ ఇది. కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2లతోపాటు కాంతారా వంటి సెన్సేషనల్ సినిమాలతో బాక్సాఫీసును బద్దలు కొట్టిన సంస్థ. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్ ను విడుదలకు సిద్ధం చేసింది.

తాజాగా హోంబలె ఫిల్మ్స్ కాంతారాకు సీక్వెల్ గా రూపొందిస్తున్న కాంతారా చాప్టర్ 1 మీద దృష్టి పెట్టింది. ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ అభిమానులను చూపు తిప్పకోనివ్వడం లేదు. ఒక చేత్తో త్రిశూలాన్ని, మరొక చేత్తో గండ్ర గొడ్డలిని చేతపట్టుకుని, తనపైకి దూకుతున్న శత్రుమూకను చూసి సింహనాదం చేస్తున్న పోజులో రిషబ్ శెట్టి ఆకట్టుకుంటున్నాడు. పరశురాముడిని స్పూర్తిగా తీసుకుని అతని పాత్రను మలచినట్లు తెలుస్తోంది. కొంకణి ప్రాంత ప్రజలకు పరశురాముడంటే భక్తి ఎక్కువ. పైగా కొంకణి ప్రాంతాన్ని పరశురామ భూమి అని పిలుస్తారు. అందువల్లనే రిషబ్ ను పాత్రను పరశురాముడి స్ఫూర్తిగా మలచినట్లు అభిమానులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News