Wednesday, December 4, 2024

ఛత్రపతి శివాజీగా రిషబ్‌ శెట్టి.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌

- Advertisement -
- Advertisement -

కంతార చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. కంతారకు ప్రీక్వెల్ గా తెరకెక్కిస్తున్న ‘కాంతార ఏ లెజెండ్‌: ఛాప్టర్‌ 1’లో నటిస్తున్న ఆయన..తాజాగా మరో భారీ చిత్రాన్ని ప్రకటించారు. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనున్న ‘ఛత్రపతి శివాజీ మహారాజ్‌’లో నటిస్తున్నారు.

సందీప్‌ సింగ్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో ఛత్రపతి శివాజీ పాత్రలో రిషబ్‌ శెట్టి కనిపించనున్నారు. మంగళవారం ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడిస్తూ ఫస్ట్‌లుక్‌ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక, 2027లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. కాగా, రిషబ్ శెట్టి.. జై హనుమాన్ సినిమాలో హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే పోస్టర్ విడుదలవగా.. భారీ రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News