Monday, December 23, 2024

వచ్చే వారం 3 ఐపిఒలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వచ్చే వారం రిషబ్ ఇన్‌స్ట్రుమెంట్స్, మోనో ఫార్మాకేర్, సిపిఎస్ షేపర్స్ ఐపిఒలు (ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్), పలు కంపెనీల లిస్టింగ్‌లు ఉన్నాయి. వచ్చే వారం 3 ఐపిఒలు మొత్తం రూ.750 కోట్లు సమీకరణ లక్షంగా వస్తుండగా, ఆ తర్వాత వారంలో వచ్చే ఐపిఒలు సుమారు.6 వేల కోట్లు సేకరించే పనిలో ఉన్నాయి. గ్లోబల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సొల్యూషన్స్ కంపెనీ అయిన రిషబ్ ఇన్‌స్ట్రుమెంట్స్ లిమిటెడ్ ఐపిఒ ఆగస్టు 30న ప్రారంభమై సెప్టెంబర్ 1 వరకు ఉంటుంది.

ఈ కంపెనీ రూ.490.78 కోట్లు సమీకరించాలనుకుంటోంది. ఈ కంపెనీ షేర్లు సెప్టెంబర్ 11న బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలో లిస్ట్ కానున్నాయి. ఐపిఒ కోసం, రిటైల్ ఇన్వెస్టర్ కనీసం ఒక లాట్ అంటే 34 షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. కంపెనీ ఐపిఒ ప్రైస్ బ్యాండ్‌ను ఒక్కో షేరుకు రూ.4,18, నుంచి రూ.441 మధ్య ఉంది. మోనో ఫార్మాకేర్ ఐపిఒ ఆగస్టు 28న ప్రారంభం కానుంది. ఈ కంపెనీ ఇష్యూ ధర శ్రేణి రూ.26 నుంచి రూ.28 మధ్య ఉంది. ఇక సిపిఎస్ షేపర్స్ ఐపిఒ ఆగస్టు 29న ప్రారంభమవుతుంది. ఈ టెక్స్‌టైల్ కంపెనీ రూ.11.10 కోట్ల సమీకరణ లక్షంగా వస్తోంది. ఆఫర్ ధర రూ.185గా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News