Sunday, December 29, 2024

పంతూ… ఇలా ఆడితే ఎలా?: కృష్ణమాచారి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: గత కొన్ని మ్యాచ్‌ల నుంచి రిషబ్ పంత్ బ్యాటింగ్ చేయడంలో విఫలమవుతున్నాడని సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ తెలిపారు. అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి అతడికి విశ్రాంతి ఇవ్వాలని సూచించాడు. పంత్ తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకోవడం లేదని కామెంట్ చేశాడు. అతడికి విరామం ఇవ్వాలా? లేక రెండు మ్యాచ్‌లకు దూరం చేయాలనేది టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకోవాలని సలహాలు ఇచ్చారు. బ్యాటింగ్ విషయంలో విఫలం కావడంతో పంత్ చాలా నిరాశతో ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఎన్నడా పంతు? అనే తమిళంలో ప్రశ్నించాడు. ఇలా ఆడితే ప్రపంచకప్ ఎలా? అని ప్రశ్నించారు. పంత్ ఆట తీరుపై చాలా మంది విమర్శిస్తున్నారు. పంత్ ఒత్తిడికి గురికాక ముందే నిరూపించుకోవాలని శ్రీకాంత్ సూచించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News