Sunday, December 22, 2024

ఒక్క పరుగుతో సెంచరీ మిస్ చేసుకున్న రిషబ్ పంత్..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో రిషబ్ పంత్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఒక్క పరుగు దూరంలో పంత్ శతకాన్ని చేజార్చుకున్నాడు. దూకుడుగా ఆడిన పంత్ కేవలం 105 బంతుల్లోనే 99 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కెఎల్ రాహుల్(12) కూడా ఔట్ అయ్యాడు. దీంతో టీమిండియా స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం 90.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 438 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. క్రీజులో జడేజా(4), అశ్విన్(0)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News