Friday, November 22, 2024

రిషబ్ పంత్ కు భారీ జరిమానా

- Advertisement -
- Advertisement -

చెన్నై సూపర్ కింగ్స్ పై గెలుపొందిన ఢిల్లీ క్యాపిటల్స్ కు ఐపిఎల్ మేనేజ్ మెంట్ షాకిచ్చింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ కు భారీ జరిమాన విధించింది. ఆదివారం సాయంత్రం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. దీంతో కెప్టెన్ పంత్ కు రూ.12లక్షల ఫైన్ వేసింది. ఈ సీజన్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా రెండోసారి జరిమానా విధించడం జరిగింది. ఇప్పటికే గుజరాత్ కెప్టెన్ గిల్ కు స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12లక్షల జరిమానా విధించారు.

కాగా, చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఐపిఎల్ బోణీ కొట్టింది. బ్యాటింగ్ బౌలింగ్‌లలో సమష్టిగా రాణించిన ఢిల్లీ టీమ్ డిపెండింగ్ ఛాంపియన్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు.. పృథ్వి షా(43), డెవిడ్ వార్నర్(52), రిషభ్ పంత్(51)లు బ్యాట ఝలిపించడంతో 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం 192 పరుగుల లక్ష ఛేదనకు దిగిన చెన్నై, ఢిల్లీ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై బ్యాటర్లలో రహానె(45), డారిల్ మిచెల్(34), జడేజా(21), ధోనీ(37 నాటౌట్)లు రాణించినా ఓటమి తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News