లక్నో సూపర్ గెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు బిగ్ షాక్ తగిలింది.అతనికి ఐపిఎల్ యాజమాన్యం జరిమానా విధించింది. శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా పంత్ కు ఫైన్ వేసినట్లు బిసిసిఐ వెల్లడించిది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.22 ఉల్లంఘించినందుకు.. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్‌కురూ.12 లక్షల జరిమానా విధించారు. అలాగే, లక్నో బౌలర్ దిగ్వేశ్ రాతీకి రెండో సారి ఫైన్ పడింది. దీంతో దిగ్వేశ్.. తన మ్యాచ్ ఫీజులో 50 శాతం ఫైన్ కట్టాల్సి వచ్చింది. దాంతోపాటు ఓ డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. అంతకుముందు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అతనికి ఫైన్ తోపాటు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. దీంతో దిగ్వేశ్ ఖాతాలో డీమెరిట్ పాయింట్ల సంఖ్య రెండుకు చేరుకున్నది.
కాగా, రాత్రి ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు 12 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.