Monday, December 23, 2024

ఆరో ర్యాంక్‌కు రిషబ్ పంత్

- Advertisement -
- Advertisement -

ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆరో స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పంత్ 99 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పంత్ తాజా ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. భారత్‌కే చెందిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాలుగో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు.

సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఒక స్థానం దిగజారి 8వ ర్యాంక్‌కు పడిపోయాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో విరాట్ విఫలమయ్యాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండు ర్యాంక్‌లు కోల్పోయి 15వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. తొలి టెస్టుకు దూరంగా ఉన్న శుభ్‌మన్ గిల్ నాలుగు ర్యాంక్‌లు కోల్పోయి 19వ స్థానంలో నిలిచాడు. కాగా, ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ 917 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

కేన్ విలియమ్సన్ (821) రెండో, హారీ బ్రూక్ (803) మూడో ర్యాంక్‌లో నిలిచారు. బౌలింగ్ విభాగంలో టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా 870 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. భారత్‌కే చెందిన సీనియర్ బౌలర్ అశ్విన్ 869 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News