- Advertisement -
క్రైస్ట్‌చర్చ్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో టీమిండియా 22 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 97 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుభ్‌మన్ గిల్ 13 పరుగులు చేసి మిల్నే బౌలింగ్‌లో శాంట్నార్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. శిఖర్ ధావన్ 28 పరుగులు చేసి మిల్నే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. కీపర్ రిషబ్ పంత్ పది పరుగులు చేసి డార్లీ మిచెల్ బౌలింగ్‌లో గ్లెన్ ఫిలీప్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 20 ఓవర్లకే మూడు వికెట్లు కోల్పోవడంతో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్(36), సూర్యాకుమార్ యాదవ్(01) బ్యాటింగ్ చేస్తున్నారు. తొలి వన్డేలో భారత జట్టు ఓటమిని చవిచూసింది.
- Advertisement -