- Advertisement -
ఢిల్లీ: రిషబ్ ఢిల్లీ నుంచి తన సొంతూరుకు కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురికావడంతో అతడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దీంతో ఏడాది నుంచి అతడు క్రికెట్‌కు దూరమయ్యాడు. 2023 ఐపిఎల్, వరల్డ్ కప్‌లో అతడు ఆడలేదు. 2024 ఐపిఎల్‌లో రిషబ్ పంత్ ఆడే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్ పేర్కొంది. పంత్ చికిత్స తీసుకొని పూర్తిగా కోలుకోవడంతో పాటు బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఫిబ్రవరి వరకు పంత్ పూర్తి పిట్‌నెస్ సాధిస్తాడని ఢిల్లీ జట్టు అధికారులలో ఒకరు వెల్లడించారు.
- Advertisement -