Saturday, September 28, 2024

ఆరో ర్యాంక్‌కు రిషబ్ పంత్

- Advertisement -
- Advertisement -

సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు క్రికెట్‌లో బరిలోకి దిగిన భారత యువ వికెట్ కీపర్ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రిషబ్ పంత్ ఏకంగా ఆరో ర్యాంక్‌కు చేరుకుని పెను ప్రకంపనలు సృష్టించాడు. చెన్నైలో జరిగిన మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ మెరుపు శతకం సాధించిన సంగతి తెలిసిందే. మరోవైపు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి షాక్ తగిలింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమైన విషయం తెలిసిందే. దీని ప్రభావం అతని టెస్టు ర్యాంకింగ్స్‌పై పడింది. కోహ్లి 12వ ర్యాంక్‌కు పడిపోయాడు. బంగ్లాతో జరిగిన మొదటి టెస్టులో కోహ్లి రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 23 పరుగులే చేశాడు.

దీంతో అతను టాప్10 ర్యాంక్ నుంచి వైదొలిగాడు. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఝలక్ తగిలింది. అతను కూడా ఐదు స్థానాలు కోల్పోయి పదో ర్యాంక్‌తో సంతృప్తి పడాల్సి వచ్చింది. చెన్నై టెస్టులో రోహిత్ రెండు ఇన్నింగ్స్‌లలో కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. తాజా ర్యాంకింగ్స్‌లో రోహిత్ పదో స్థానంలో నిలిచాడు. కాగా, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇదిలావుంటే ఇంగ్లండ్ స్టార్ జో రూట్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్, డారిల్ మిఛెల్‌లు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. కాగా, బౌలింగ్ విభాగంలో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. భారత్‌కే చెందిన జస్‌ప్రిత్ బుమ్రా రెండో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News