Monday, December 23, 2024

రెప్పపాటులో.. పంత్ యాక్సిడెంట్ (వీడియో)

- Advertisement -
- Advertisement -

భారత వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదం దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి. అతివేగంగా ప్రయాణిస్తున్న అతడి బీఎమ్​డబ్ల్యూ కారు రోడ్డు పక్కనే ఉన్న రెయిలింగ్ కు ఢీకొట్టింది. ఆ వెంటనే కారు పూర్తిగా కాలిపోయింది. పంత్ తీవ్రగాయాలతో బయటపడ్డాడు. ప్రమాద సమయంలో పంతే కారు నడిపినట్లు తెలుస్తోంది. అతడు త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. రిషబ్ పంత్ ఉత్తరాఖండ్‌ నుంచి కారులో ఢిల్లీకి వస్తుండగా హరిద్వార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పంత్ ప్రస్తుతం డెహ్రాడూన్‌లోని మాక్స్ హాస్పిటల్‌లో గాయాలకు చికిత్స పొందుతున్నాడు. రిషబ్ కు మెరుగైన వైద్యం, అవసరమైన అన్ని సహాయాలు అందేలా చూడాలని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అధికారులను ఆదేశించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News