Monday, January 27, 2025

మెరుగైన వైద్య కోసం ఇంగ్లాండ్‌కు పంత్….

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: టీమిండియా బ్యాట్స్‌మెన్, కీపర్ రిషభ్ పంత్ డెహ్రాడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నుదుటి భాగంలో గాయాలు ఎక్కువుగా ఉండడంతో ప్లాస్టిక్ సర్జరీ చేశారు. మెరుగైన వైద్యం కోసం పంత్‌ను డెహ్రాడూన్ నుంచి ముంబయికి తరలించారు. బిసిసిఐ వైద్యుల సమక్షంలో పంత్ కుడి కాలు లిగ్మెంట్‌కు శస్త్ర చికిత్స చేశారు. బిసిసిఐ కార్యదర్శి జై షా కూడా ఎప్పటికప్పుడు పంత్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.

అవసరమైతే పంత్‌ను ఇంగ్లాండ్‌కు తరలించే అంశంపై బిసిసిఐ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. రోడ్డు ప్రమాదంలో గాయపడిన పంత్ త్వరగా కోలుకొని తన ఆటను కొనసాగించాలని మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ సందేశం పంపాడు. కొన్ని సంఘటనలు జరుగుతాయని, ఎదుర్కొని ముందుకు సాగాలని సూచించారు. అతడు త్వరగా కోలుకొని జట్టులోకి చేరాలని దేవుడ్ని పార్థిస్తున్నామని తెలిపారు.

పంత్‌కు రోడ్డు ప్రమాదం జరిగిందని తెలియగానే తన గుండె ఎంత వేగంగా కొట్టుకుందో మాటల్లో చెప్పలేనని యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ తెలిపాడు. పంత్‌కు ప్రమాదం జరిగిన విషయం అభిమానులు చెప్పారని, సిరీయస్‌గా ఉందని తెలియగానే షాక్‌కు గురయ్యానని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News