Thursday, January 23, 2025

రష్మికకు రిషబ్ శెట్టి రీ కౌంటర్…

- Advertisement -
- Advertisement -

 

నటి రష్మిక, నటుడు రిషబ్‌శెట్టి మధ్య గత కొంతకాలంగా కోల్డ్‌ వార్‌ నడుస్తోన్న విషయం తెలిసిందే. రిషబ్ శెట్టి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి, రష్మిక జంటగా నటించిన కిరిక్ పార్టీ లో రష్మిక కథానాయికగా చేసింది. 2016లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం విడుదలై ఆరేళ్లు పూర్తి అయిన సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ రిషబ్‌ ట్వీట్ చేశాడు. ఈ సెలబ్రేషన్స్‌లో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ  హిరో రక్షిత్, నిర్మాణ సంస్థ రంవా స్టూడియోస్, మ్యూజిక్ డైరెక్టల్ లోకనాథ్ ను రిషబ్ ట్యాగ్‌ చేశారు. కానీ సినిమాలో హిరోయిన్ గా నటించిన రష్మికను మాత్రం ట్యాగ్ చేయకపోవడంతో వీరిద్దరి గొడవలు నిజమనే టాక్ తెరపైకి వచ్చింది. కావాలనే రిషబ్ ఇలా చేశాడని , రష్మికకు మరోసారి కౌంటర్‌ ఇచ్చాడంటూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News