Thursday, December 26, 2024

దీపావళి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని రిషీ సునాక్ దంపతులు

- Advertisement -
- Advertisement -

లండన్: యుకే ప్రధాని అధికారిక నివాసంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌లో ఉన్న డౌనింగ్ స్ట్రీట్‌లో జరిగిన ఈ వేడుకల్లో ప్రధాని రిషి సునాక్, ఆయన సతీమణి అక్షతా మూర్తి పాల్గొన్నారు. భార్య అక్షతా మూర్తితో కలిసి దీపాలు వెలిగించారు. వేడుకలకు హాజరైన హిందూ అతిథులను ప్రధాని సునాక్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని అధికారిక నివాసం దీపాల కాంతులతో మెరిసిపోయింది. ఈ నేపథ్యంలో ప్రధాని కార్యాలయం స్పందించింది.

చీకట్లపై వెలుగు విజయానికి సూచిగా జరుపుకునే దీపవళి వేడుకలను డౌనింగ్ స్ట్రీట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ కమ్యూనిటీకి చెందిన అతిథులను ప్రధాని రిషి సునాక్ ఆహ్వానించారంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అందులో అక్షతా మూర్తితో కలిసి ఆయన దీపాలను వెలిగిస్తున్న ఫొటోలను షేర్ చేసింది. యూకేతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారందరికి దీపావళి శుభాకాంక్షలు తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News