Saturday, December 21, 2024

రిషి సునాక్‌కు భాంగ్రా డాన్స్‌తో వెల్‌కం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జి 20 సదస్సుకు విచ్చేస్తున్న అతిధులలో భారత్‌కు అత్యంత విశిష్ట వ్యక్తిగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నిలుస్తున్నారు. భారతీయ పూర్వపు మూలాలున్న రిషికి ఇండియాలో ఘన స్వాగతం దక్కనుందని బ్రిటన్ పత్రికలు రాశాయి. రిషి సునాక్ తన భార్య అక్షత మూర్తితో కలిసి ఈ వారంలో ఇండియా(భారత్)కు వెళ్లుతున్నారని , అక్కడ ఆయనకు ఢిల్లీలోని ఆయన బంధువుల నుంచి సాంప్రదాయక గానాబజానాల స్వాగతం దక్కుతుందని ది డైలీ టెలిగ్రాఫ్ తెలిపింది. పూల గుచ్ఛాలతో ఏకబిగిన సాగే పంజాబీ గానా బజానాలు ,భాంగ్రాలతో రిషికి ఆయన సన్నిహితులు ఆహ్వానిస్తారని పత్రిక తెలిపింది. రిషి సునాక్‌కు వరుసకు మేనమామ అయిన డాక్టర్ గౌతమ్ దేవ్ సూద్ అల్లుడి రాకకు అన్ని ఏర్పాట్లు చేశారు. సునాక్ బంధువులు అంతా ఎక్కడున్నా ఢిల్లీకి చేరుకోవాలని ఫోన్లు చేశారని వెల్లడైంది.

ఆయన అధికారిక కార్యక్రమాలలో తీరిక లేకుండా ఉండొచ్చు. కానీ ఒక్క రాత్రి ఆయన కోసం పెద్ద విందు ఏర్పాటు చేశామని, పంజాబీ సంగీతం, ఆహారం అంతా ఉంటుందని రిషి బంధువు అయిన సభాష్ బేరి తెలిపారు. ప్రధాని అయిన తరువాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న రిషి సునాక్ భార్య అక్షత మూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి, రచయిత్రి సుధామూర్తిల కూతురు. ఈ విధంగా చూసిన రిషిసునాక్‌కు ఇండియా అత్తవారిల్లు. అయితే ఆయన జి 20 సదస్సులో తీరిక లేకుండా ఉంటారు కాబట్టి , బంధువులు స్నేహితులు పిలిచారని విందులకు వెళ్లలేకపోవచ్చునని కొన్ని పత్రికలు రాశాయి. అయితే అత్యంత అరుదుగా దక్కే ఇటువంటి అవకాశాలలో తన బంధువుల ఆతిధ్యాన్ని ఆయన కాదనలేకపోవచ్చునని , పైగా వైఫ్ వైపు వారిని కాదంటారా? అని ఓ బ్రిటన్ పత్రిక స్పందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News