Friday, November 22, 2024

సీట్ బెల్ట్ ధరించనందుకు ప్రధానికి జరిమానా

- Advertisement -
- Advertisement -

లండన్ : సీట్ బెల్ట్ ధరించనందుకు బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్‌కు అక్కడి పోలీసులు 100 పౌండ్లు జరిమానా విధించారు. ఓ వీడియో చిత్రీకరణ కోసం శుక్రవారం ప్రయాణంలో ఉన్న సమయంలో ఆయన కొద్దిసేపు సీట్‌బెల్ట్ తొలగించారు. ఇది విమర్శలకు తావివ్వడంతో సునాక్ తన తప్పును అంగీకరించి ప్రజలకు క్షమాపణలు చెప్పారు. దీన్ని పరిశీలించిన లాంక్‌షైర్ పోలీసులు ఈ తప్పును నిర్ధారించుకుని సునాక్‌కు పెనాల్టీ నోటీస్ జారీ చేశారు.

బ్రిటన్‌లో కారు ప్రయాణికులు సీట్‌బెల్ట్ ధరించకుంటే అక్కడికక్కడే 100 పౌండ్లు జరిమానా చెల్లించవలసి ఉంటుంది. ఈ వ్యవహారం కోర్టుకు చేరితే 500 పౌండ్ల వరకు జరిమానా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతివారూ సీట్‌బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని ప్రధాని విశ్వసిస్తున్నారని అధికార ప్రతినిధి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News