లండన్: కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 20 మంది పార్లమెంట్ సభ్యుల మద్దతును కూడగట్టుకుని సెప్టెంబర్ 5న బ్రిటిష్ ప్రధాన మంత్రి పదవికి జరిగే ఎన్నికల బరిలో ముందు వరుసలో ఉన్న అభ్యర్థులలో ఒకరిగా మాజీ చాన్సలర్, 42 ఏళ్ల బ్రిటిష్-ఇండియన్ ఎంపి రిషి సునక్ నిలిచారు. ప్రధాని బోరిస్ జాన్సన్ స్థానంలో కొత్త ప్రధాని ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది. మంగళవారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలలోపు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. ప్రధాని ఎన్నికల రేసులో రిషి సునాక్‌తోపాటు వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డాంట్, కొత్త చాన్సలర్ నాధిమ్ జహావి, టామ్ టోగెంధట్ ఉన్నారు. వీరే కాక భారతీయ సంతతికి చెందిన అటార్నీ జనరల్ సుయెల్లా బ్రేవర్‌మ్యాన్, మాజీ కార్యదర్శి లిజ్ ట్రస్, నైజీరియా సంతతికి చెందిన కెమి బడేనోష్, మాజీ విదేశాంగ్ కార్యదర్శి జెరెమి హంట్, రశానా కార్యదర్శి గ్రాంట్ షాప్స్, విదేశీ కార్యాలయ మంత్రి రెహ్మాన్ చిష్తి, మాజీ ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ కూడా బరిలో నిలిచే అవకాశం ఉంది.
బ్రిటన్ ప్రధాని ఎన్నిక బరిలో రిషి సునక్
- Advertisement -
- Advertisement -
- Advertisement -