లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి ఎన్నికైన భారత సంతతి వ్యక్తిగా రుషి సునాక్ సంచలనం సృష్టించారు. గత సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో రుషి సునాక్ పై గెలుపొంది లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధాన మంత్రిగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, ఆమె ప్రధాన మంత్రి పదవి చేపట్టిన రెండు నెలల్లోనే ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీంతో లిజ్ ట్రస్ పై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలో తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమని లిజ్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఇక, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రధాని రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో రిషి సునాక్, పెన్నీ మోర్డాంట్ మధ్య పోటీ నెలకొంది. అయితే, ప్రధాని రేసులో రిషి సునాక్ కు పోటీదారుగా నిలిచిన పెన్నీ కూడా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు. దీంతో రిషి సునాక్, బ్రిటన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నెల 28న బ్రిటన్ ప్రధానిగా రిషి ప్రమాణం చేయనున్నారు.
రిషి సునాక్ పూర్వీకులు పంజాబ్ రాష్ట్రం వారు. 1980 మే 12న బ్రిటన్‌లోని సౌథాంప్టన్‌లో రిషి సునాక్ జన్మించారు. స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పట్టా అందుకున్న రిషి.. అంతకుముందు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకానమీ కోర్సుల్లో పట్టా అందుకున్నారు. 2001-04 మధ్య గోల్డ్‌మాన్ సాక్‌లో విశ్లేషకుడిగా సేవలు అందించారు.
Rishi Sunak set to become first UK’s Indian-Origin PM