Friday, November 15, 2024

భారత్ కెనడా ఉద్రిక్తత సడలితేనే మేలు..

- Advertisement -
- Advertisement -

లండన్ : భారత్ కెనడా మధ్య ఉద్రిక్తతలు సడిపోవాలని ఆశిస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తెలిపారు. శుక్రవారం బ్రిటన్ ప్రధాని రిషి కెనడా ప్రధానితో ఫోన్‌లో మాట్లాడినట్లు డౌనింగ్ స్ట్రీట్ నుంచి శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. జూన్‌లో కెనడాలో సిక్కు వేర్పాటువాద నేత హత్య, తరువాత భారత్‌పై కెనడా ప్రధాని ఆరోపణల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. ఈ పరిణామంపై భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని సునాక్ ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రధానికి జస్టిన్ ట్రూడ్ ఇప్పటి తాజా పరిస్థితిని వివరించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు.

ఎక్కడైనా చట్టపరమైన పాలనను, చట్టపరమైన చర్యలను బ్రిటన్ గౌరవిస్తుందని సునాక్ ఈ దశలో ట్రూడోకు తెలిపారు. ప్రస్తుత ఉద్రిక్తతలు తొలిగిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపిన బ్రిటన్ ప్రధాని తదుపరి చర్యల విషయంలో ఎప్పటికప్పుడు మాట్లాడుకోవాలని ట్రూడోకు సూచించారు. దేశాల సర్వసత్తాకత, చట్టాల పాలన , దౌత్య సంబంధాల విషయంలో వియన్నా కన్వెన్షన్ సూత్రాల ఆచరణకు అన్ని దేశాలూ కట్టుబడి ఉండాల్సిందేనని బ్రిటన్ ప్రధాని పేర్కొన్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. కెనడా భారత్ వివాదం విషయంలో ఇప్పటికైతే అమెరికా పూర్తిగా ఎటువైపు మద్దతు ప్రకటించలేదు. ఇరుదేశాలు కీలకమనే వాదనతో ఉంది. బ్రిటన్ కూడా ఇదే పద్ధతిని పాటిస్తుందని ట్రూడోతో సునాక్ మాటలతో స్పష్టం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News