Monday, December 23, 2024

శ్రీ కృష్ణుడి ఆలయాన్ని సందర్శించుకున్న రిషి సునాక్

- Advertisement -
- Advertisement -

 

Rishi Sunak

లండన్: బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్,  తన భార్య అక్షత మూర్తితో కలిసి గురువారం వాట్‌ఫోర్డ్‌లోని భక్తివేదాంత శ్రీకృష్ణుడి ఆలయాన్ని సందర్శించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వాట్‌ఫోర్డ్‌ )లోని ‘ఇస్కాన్’ మందిరాన్ని సందర్శించినట్లు రిషి ట్వీట్ చేశారు. “నా భార్య అక్షతతో కలిసి భక్తివేదాంత ఆలయానికి వెళ్లి జన్మాష్టమి వేడుకలు జరుపుకున్నా. కృష్ణుడి పుట్టిన రోజు సందర్భంగా హిందువులు ఈ పండుగ జరుపుకుంటారు” అని ట్వీట్ చేశారు. ఆలయంలో సతీమణి అక్షతతో కలిసి దిగిన ఫొటోను ఈ ట్వీట్‌కు జత చేశారు. దీంతో హిందూ మూలాలు మర్చిపోని రిషిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక 2019 డిసెంబర్‌లో సునాక్ యూకే హౌజ్ ఆఫ్ కామన్స్‌ మెంబర్‌గా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో కూడా చేతిలో భగవద్గీతతో కనిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News