Monday, January 20, 2025

సునాక్‌కు తిరుగుబాటు ముప్పు

- Advertisement -
- Advertisement -

యుకె చదువు అనంతర వీసాకు ఆంక్షలు విధించాలని ప్రధాని రిషి సునాక్ యోచిస్తున్నారని, తన మంత్రులు కొందరి నుంచి తీవ్ర అభ్యంతరాలు ఉన్నప్పటికీ చట్టపరమైన శరణార్థుల సంఖ్యను కట్టడి చేసే యత్నాలలో భాగంగా గ్రాడ్యుయేట్లు తమ డిగ్రీ కోర్సు తరువాత దేశంలో ఉంటూ, రెండు సంవత్సరాల పాటు పని చేసేందుకు అది వీలు కల్పిస్తుందని ఆదివారం ఒక దినపత్రిక వార్త సూచించింది.‘ది అబ్జర్వర్’ పత్రిక సమాచారం ప్రకారం, గ్రాడ్యుయేట్ రూట్ పథకాన్ని రద్దు చేయాలనే ప్లాన్‌పై సునాక్ క్యాబినెట్‌లో తిరుగుబాటు ఎదుర్కొంటున్నారు.

2021లో ప్రారంభించినప్పటి నుంచి అటువంటి వీసాల సంఖ్యలో అగ్ర స్థానంలో ఉన్న భారతీయ విద్యార్థులలో నుంచి యుకె వర్శిటీలు ఎంపిక చేసేందుకు అది ఉపకరిస్తున్నది. ఈ అంశంపై తిరుగుబాటకు నేతృత్వం వహిస్తున్న వారిలో యుకె విద్యా శాఖ మంత్రి గిలియన్ కీగన్, ఆర్థిక శాఖ మంత్రి జెరెమీ హంట్, విదేశాంగ శాఖ మంత్రి డేవిడ్ కామెరాన్ ఉన్నారు. అటువంటి వీసాలను ఏమాత్రం కుదించినా భారతీయులతో సహా విదేశీ విద్యార్థులకు యుకె అంత ఆకర్షణీయం కాబోదని వర్శిటీ, వాణిజ్య అధినేతలు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News