Wednesday, January 22, 2025

సునాక్ పిఎం అయితే ఓకె

- Advertisement -
- Advertisement -

Rishi Sunak will make good PM: opinion poll

ఒపినియన్ పోల్‌లో ఓటు మొగ్గు

లండన్ : రిషి సునాక్ బ్రిటన్‌కు సముచిత ప్రధాని అయ్యే అర్హతలు సంతరించుకుని ఉన్నారని బ్రిటన్‌లో అత్యధికులు స్పష్టం చేస్తున్నారు. బోరిస్ జాన్సన్ రాజీనామా తరువాత అధికార కన్సర్వేటివ్ పార్టీ నాయకుడి ఎన్నిక దేశ తదుపరి ప్రధానిని నిర్ణయించడంలో కీలక అవుతుంది. ఈ క్రమంలో జరుగుతోన్న పోటీలో రెండోరౌండ్‌లోనూ మాజీ ఆర్థిక మంత్రి అయిన సునాక్ ఆధిక్యత దక్కించుకున్నారు. తదుపరి ప్రధాని ఎవరైతేబాగుంటుందనే విషయంపై జరిగిన ఒపినియన్ పోల్ వివరాలను ది సండే టెలిగ్రాఫ్ ప్రచురించింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో టోరీలకు మద్దతు పలికిన వారిని ఎంచుకుని శాంపుల్‌గా జెఎల్‌పార్టనర్స్ పోల్‌ను నిర్వహించారు. 48 శాతం మంది సునాక్ తదుపరి ప్రధాని కావాలనుకుంటున్నారు. ఇక 39 శాతం మంది విదేశాంగ మంత్రి లిజ్ ట్రుస్‌ను ఇష్టపడ్డారు. వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డంట్ వైపు 33 శాతం మంది మొగ్గుచూపారు. జాన్సన్ తరువాతి ప్రధాని ఎవరైనా పన్నుల తగ్గింపు సమర్థత సంతరించుకుని ఉండాలని అత్యధికులు ఆశిస్తున్నారు. ఇప్పుడు నిర్వహించిన ఒపినియన్ పోల్‌లో కూడా ఇదే కీలకం అయింది. సునాక్‌కు విషయ పరిజ్ఞానం ఉంది. పలు విషయాలపై తగు విధంగా స్పందిస్తారు. ఇదే విధంగా అందరి అభిప్రాయాలను తీసుకుంటారని, కలగొలుపు మనిషి అని చాలా మంది మద్దతు వ్యక్తం చేశారు.

ఎవరినైనా ఎన్నుకోండి …సునాక్‌ను తప్ప
మాజీ ప్రధాని జాన్సన్ లాబీయింగ్

ఓ వైపు పలు రౌండ్లలో రిషి సునాక్ కన్సర్వేటివ్ పార్టీ నేతకు జరిగే ఎన్నికలలో దూసుకుపోతూ ఉండగా మరో వైపు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆయనక బ్రేక్ వేసేలా మారారు. తన మద్దతుదార్లను రంగంలోకి దించారు. ఎంపిలు ఇతరులెవ్వరినైనా ఎంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ సునాక్‌ను గెలిపించరాదని , ఇందుకు తగు బలం ఏదో విధంగా సంతరించుకోవాలని జాన్సన్ తరఫున కొందరు లాబీయింగ్‌కు దిగుతున్నట్లు వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News