Monday, January 20, 2025

ఇల్లూవాకిలి లేనివాడితో రుషి సునాక్ చర్చ!

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లాండ్ ప్రధాని రుషి సునాక్ క్రిస్మస్ సందర్భంగా ఓ ‘షెల్టర్ హోమ్’ను సందర్శించారు. అక్కడ దిక్కులేని వారికి వడ్డన కూడా చేశారు. అప్పుడు ఓ ఇల్లూవాకిలి లేని వ్యక్తితో జరిపిన సంభాషణ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. వారి సంభాషణ చాలా భిన్నంగా జరిగింది. వారి సంభాషణను ఐటివి న్యూస్ షేర్ చేసింది.

ఇంగ్లాండ్ ప్రధాని సునాక్ మొదట ఆ వ్యక్తితో ‘ఎలా ఉన్నారు’ అని అడిగారు. దానికతడు ‘ఆకలితో ఉన్నాను’ అని జవాబిచ్చాడు. మాటల సందర్భంగా సునాక్ ‘మీరు వ్యాపారం చేస్తారా?’ అని అడిగినప్పుడు, ఆ వ్యక్తి ‘లేదు, నేను ఇల్లూవాకిలి లేని వాడిని(హోమ్‌లెస్ పర్సన్)’ అని జవాబిచ్చాడు.

ఆ తర్వాత ఆ వ్యక్తి తనకు వ్యాపారంలో ఆసక్తయితే ఉందని అన్నాడు. అప్పుడు సునాక్ అతడితో ‘ఎలాంటి వ్యాపారం చేయాలనుకుంటున్నారు మీరు?’ అని ప్రశ్నించారు. ఆ తర్వాత వారిద్దరూ ఆర్థిక రంగంపై సంభాషించారు. ‘మీరు ఎందులోనైనా చేరాలనుకుంటున్నారా?’ అని సునాక్ అడిగినప్పుడు, అతడు ‘నేను ఎందులోనైనా చేరేందుకైతే నాకు అభ్యంతరం లేదు. కానీ ముందు క్రిస్మస్ అవ్వని. ఏ ఛారిటీ వాళ్లయినా క్రిస్మస్‌నాడు తాత్కాలిక వసతి ఏర్పాటు చేస్తారేమో…అలాగైతే తనకు వీధుల్లో నిరాశ్రయుడిలా పడుకునే బాధ తప్పుతుంది’ అన్నాడు.
ఇదిలావుండగా లేబర్ పార్టీ డిప్యూటీ లీడర్ ఈ సంభాషణను ‘విచారకరమైనది’ అని అభివర్ణించారు. కాగా వారి సంభాషణ వీడియో వైరల్‌గా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News