Wednesday, January 22, 2025

ఢిల్లీలో పెరుగుతోన్న పాజిటివిటీ రేటు

- Advertisement -
- Advertisement -

Rising corona positivity rate in Delhi

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి కేసులు స్వల్ప హెచ్చు తగ్గులతో రోజువారీ కేసులు వెయ్యికి సమీపం లోనే నమోదవుతున్నాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండటంపై ఆందోళన కలిగిస్తోంది. దేశంలో నమోదవుతోన్న కేసుల్లో అధిక సంఖ్యలో ఇక్కడి నుంచే ఉంటున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం శనివారం దేశ వ్యాప్తంగా 3,65,118 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1150 కొత్త కేసులు వెలుగు లోకి వచ్చాయి. ఇక మరణాలు గణనీయంగా తగ్గుతుండటం ఊరట కలిగించే విషయం. గడిచిన 24 గంటల్లో 4 మరణాలు నమోదు కాగా, ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 5,21,751 కు చేరింది. ఢిల్లీలో కేసులు అంతక్రితం రోజుతో పోల్చితే 26 శాతం పెరగడం అక్కడి అధికారులకు ఆందోళన కలిగిస్తోంది.

తాజాగా అక్కడ 461 కేసులు నమోదు కాగా, 2 మరణాలు చోటు చేసుకున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.95 శాతం నుంచి 5.33 శాతానికి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 954 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటివరకు వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.25 కోట్లు దాటింది. ఆ రేటు 98.76 శాతంగా కొనసాగుతోంది. ఇక కోలుకున్న వారి కంటే కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో క్రియాశీల కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 11,558 యాక్టివ్ కేసులుండగా, ఆ రేటు 0.03 శాతంగా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌కు సంబంధించి శనివారం 12,56,533 మంది టీకాలు వేయించుకోగా, ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 186.51 కోట్లు దాటింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News