Wednesday, January 22, 2025

తెలంగాణలో పెరుగుతున్న డెంగీ, స్వైన్ ఫ్లూ కేసులు

- Advertisement -
- Advertisement -

 

Swine Flu

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సీజనల్ ఫ్లూ వైరస్ లు ప్రతాపం చూపిస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లో డెంగీ, స్థానిక వ్యాధి(ఎండెమిక్) స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో ‘ఎండెమిక్ స్వైన్ ఫ్లూ’ కేసులు నమోదైనట్టు హైదరాబాద్ లోని ప్రభుత్వ ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకర్ వెల్లడించారు. ‘‘సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. డెంగీ కేసులు కూడా పెరిగాయి. 60-80 పాజిటివ్ కేసులు వచ్చాయి. ముఖ్యంగా చిన్నారుల్లోనే డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. టైఫాయిడ్ కేసులు కూడా పెరిగాయి. ఎండెమిక్ స్వైన్ ఫ్లూ కేసులు కూడా నమోదయ్యాయి’’ అని తెలిపారు.

మామూలుగా ఏటా వర్షాకాలంలో డెంగీ కేసులు పెరుగుతుంటాయి. కాకపోతే ఈ విడత స్వైన్ ఫ్లూ కేసులు వెలుగు చూడడం గమనార్హం. స్వైన్ ఫ్లూ బలహీనపడిపోయిన వైరస్,  కాకపోతే అది పూర్తిగా అంతరించిపోలేదు. కొన్నేళ్ల క్రితం మొదటి సారి స్వైన్ ఫ్లూ వెలుగు చూసినప్పుడు పదుల సంఖ్యలో మరణాలు కూడా నమోదయ్యాయి. వర్షాలు, వరదలతో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య మంత్రి హరీశ్  రావు ఈ ఏడాది జులైలో వైద్య శాఖను అప్రమత్తం కూడా చేశారు. పరీక్షా ఫలితాలను వెంటనే ఇచ్చేందుకు వీలుగా తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రం 24 గంటల పాటు పనిచేయాలని ఆదేశించడం గమనార్హం. ఇంటి ఆవరణలో నీరు నిల్వ లేకుండా, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని, కాచి వడపోసిన నీటిని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News