పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలున్నాయని అంచనా వేసింది. తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు సూచనలున్నాయని, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలున్నాయని అంచనా వేసింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. సోమవారం నుంచి బుధవారం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని చెప్పింది. గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు అక్కడక్కడ భారీ వర్షాలుపడుతాయని చెప్పింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. ఆదివారం సాయంత్రానికి నీటి మట్టం 30 అడుగుల దాటి ప్రవహిస్తోంది. వరద నీరు స్నానాల ఘట్టాల వరకు చేరింది. ఎగువ ప్రాంతా నుంచి వచ్చే వరద ప్రవాహం కారణంగా కొద్దిమేర నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇంకా కొంత మేర పెరిగి తగ్గే అవకాశం కూడా ఉందంటున్నారు. మరో వైపు గోదావరిలో నీటి మట్టం పెరుగుతుండటంతో భద్రాచలం ప్రజల్లో భయాందోళనలు నెలకొంది.గత సంవత్సరం వచ్చిన వరదలకు గోదావరి కరట్ట చాలా వరకు పాడైంది. కరకట్టకు అక్కడక్క రాళ్ళు కూడా లేచిపోయయి. గతేడాది 72 అడుగులు రావడంతో కరకట్ట చివరి భాగం వరకు గోదారి నీటిమట్టం చేరి ప్రవహించింది. చాలా వరకు కరకట్ట బలం తగ్గింది.దీని పునరుద్దరణ పనులు చేపట్టక పోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.