Friday, January 24, 2025

విద్యుత్ సంక్షోభానికి ప్రమాద గంటికలు మోగిస్తున్న ఉష్ణోగ్రత!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత్‌లోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత పెరుగుతోంది. దాంతో విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతానికైతే రికార్డు స్థాయికి ఉష్ణోగ్రత చేరుకోలేదు. కొన్ని ప్రాంతాల్లో గత వారం ఉష్ణోగ్రత సాధారణం కంటే బాగానే పెరిగిందని వాతావరణ శాఖ పేర్కొంది. సేద్యపు నీటి పంపుల ఉపయోగం, ఎయిర్ కండిషన్ల ఉపయోగం కారణంగా విద్యుత్ వినియోగం పెరిగిపోవచ్చని భావిస్తున్నారు. విద్యుత్ ప్లాంట్లు ఇప్పటికే దిగుమతి చేసుకున్న బొగ్గును ఉపయోగిస్తున్నాయి. ఎండాకాలం మూడు నెలలు విద్యుత్తు ప్లాంటు నిరాటంకంగా పనిచేయడానికి దిగుమతి ఆర్డర్లు కూడా పెట్టారు. దీనివల్ల దేశీయ బొగ్గు సరఫరా ఒత్తిడి తగ్గనుంది. ఏప్రిల్‌లో 229 గిగావాట్స్ స్థాయికి చేరుకోవచ్చని భారత విద్యుత్ మంత్రిత్వశాఖ భావిస్తోంది.

Soaring Demand

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News