Friday, November 22, 2024

వాయు కాలుష్యంతో డెమెన్షియా రిస్కు ఎక్కువ

- Advertisement -
- Advertisement -
Risk of dementia is higher with air pollution
యానివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకుల అధ్యయనం

వాషింగ్టన్ : గాలిలో కాలుష్య స్థాయి ఏమాత్రం పెరిగినా డెమెన్షియా (చిత్త వైకల్యం) రిస్కు ఎక్కువౌతుందని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. డెమెన్షియా అంటే వృద్ధుల్లో రానురాను ఆలోచనల్లో మార్పు వచ్చి మానసిక స్థితి ఆందోళన కరంగా తయారవుతుంది. మతిమరుపుకు దారి తీసే అల్జిమర్స్ వ్యాధికి కూడా దీంతో సంబంధం ఉంటుంది. భారీ ఎత్తున, సుదీర్ఘకాల రెండు అధ్యయన ప్రాజెక్టుల నుంచి లభించిన డేటా ఆధారంగా పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఒకటి 1970లో వాయు కాలుష్యాన్ని లెక్క కట్టేది కాగా, మరో ప్రాజెక్టు వాయు కాలుష్య ం వల్ల డెమెన్షియాకు ఎంంత రిస్కో పరిగణించేది. దీన్ని 1994 లో చేపట్టారు. పరిశోధకులు పిఎం 2.5 లేదా 2.5 మైక్రోమీటర్ల పరిమాణంలో కాలుష్య రేణువుల పదార్ధానికి డెమెన్షియాకు గల సంబంధాన్ని గుర్తించారు.

కాలుష్య రేణువుల పదార్థం ఘనపు మీటరుకు 1 మైక్రోగ్రాము వంతున పెరిగితే 16 శాతం వంతున డెమెన్షియా ముప్పు పెరుగుతుందని పరిశోధక బృందానికి నాయకత్వం వహించిన రకేల్ షఫెర్ వివరించారు. అల్జిమర్స్ రకం డెమెన్షియాకు కూడా ఇదే విధంగా వర్తిస్తుందని పేర్కొన్నారు. జర్నల్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ పెర్సెపెక్టివ్స్ లో ఈ అధ్యయనం ఆగస్టు 4 న వెలువడింది. వృద్ధుల ఆలోచనల్లో మార్పు అనే అంశంపై సీటిల్ ఏరియా లోని 4000 మందిపై ఈ పరిశోధన జరిగింది. వీరిలో 1994 నుంచి అధ్యయనంలో గుర్తించిన డెమెన్షియా లక్షణాలు కలిగిన వెయ్యికి మించిన వారిని పరిశోధకులు ఇప్పుడు అధ్యయనం లోకి తీసుకున్నారు. వీరిలో ప్రతి ఒక్కరిపై సరాసరి కాలుష్య ప్రభావం ఎంతవరకు ఉందో పోల్చి చూశారు.

ఉదాహరణకు 72 ఏళ్ల వృధ్ధాప్యం వచ్చేసరికి ఆ వ్యక్తి డెమెన్షియా రోగిగా గుర్తించబడితే మిగతా వారిపై కాలుష్య ప్రభావం ఎంతవరకు ఉంటుందో వారికి 72 ఏళ్లు వచ్చే వరకు దశాబ్ద కాలంగా అధ్యయనం చేశారు. దాంతో ఘనపు మీటరుకు ఒక మైక్రోగ్రాము వంతున కాలుష్య స్థాయి పెరిగితే 16 శాతం డెమెన్షియా రిస్కు ఎక్కువగా ఉంటుందని నిర్ధారించ గలిగారు. ఆహారం, వ్యాయామం, జన్యువుల ప్రభావం తదితర అంశాలన్నీ డెమెన్షియా పెరగడానికి దోహదం చేస్తాయని చెబుతున్నా వాయు కాలుష్యం కూడా కీలకమైన పాత్ర వహిస్తుందని పరిశోధకులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News