Friday, December 20, 2024

కంటి సమస్యలను నిర్లక్ష్యం చూపు కోల్పోయే ప్రమాదం

- Advertisement -
- Advertisement -

గ్లకోమా వ్యాధిపై నగర ప్రజలకు వైద్యశాఖ అవగాహన చేపట్టాలి
40 ఏళ్లకు పైబడిన వారంతా కంటి పరీక్షలు చేయించుకోవాలి
గ్రేటర్‌లో రోజు రోజుకు పెరుగుతున్న కంటి సమస్యల రోగులు: డా. ప్రణతి

Free Eye Treatment for Telangana People

మన తెలంగాణ,సిటీబ్యూరో : కంటి సమస్యలపై సాధారణంగా ప్రజలు కొద్దిగా ఆలసత్వం వహిస్తారు. అయితే ఇవి చాలా ప్రమాదాన్ని తీసుకొస్తాయని, అందులో గ్లకోమా అనేది కీలకమని వైద్యులు పేర్కొంటున్నారు. దీని నగర ప్రజలకు అవగాహన పెంచాల్సిన బాధ్యత వైద్యశాఖ అధికారులపై ఉందంటున్నారు. దీర్ఘకాలికంగా కంటిలో ఒత్తిడి పెరిగి దృష్టి నాడి దెబ్బతిని క్రమంగా కంటి చూపు క్షిణిస్తుంది ఇలాంటి లక్షణాలు ఉంటే గ్లకోమా వ్యాధిగా బావించాలని కిమ్స్ వైద్యులు డా. బి.ప్రణతి చెప్పారు. మనదేశంలో ఒకటి కోటి పన్నెండు లక్షలమంది ప్రజలు గ్లకోమా బారినపడగా, అందులో 12లక్షలమంది పూర్తిగా చూపు కోల్పోయారని, నగరంలో సుమారు 90శాతం కేసులు ఇంకా నమోదు చేయబడలేదన్నారు. కంటి పరీక్షలు 40 ఏళ్లుపై బడినవారు, అధిక మయోపియా, అధిక హైపర్ మెట్రోపియా ఉన్న వారు పరీక్షలు చేయించుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు, గుండెజబ్బులు, అధిక కొలెస్ట్రాల్‌లతో బాధపడేవారు. కుటుంబంలో ఎవరికైనా గ్లకోమా ఉన్నా…. పూర్వం కంటికి దెబ్బ తగలినవారు కూడా వెంటనే టెస్టులు చేసుకోవాలి. దీర్ఘకాలంగా స్టెరాయిడ్స్ మాత్రలు, కంటి చుక్కలు మందు ఉపయోగించేవారు జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకోవాలని సూచిస్తున్నారు.

గ్లకోమా లక్షణాలు:

చాలా సమయాల్లో చూపు కోల్పోయేవరకు ఏలక్షణాలు కనిపించవు. ఈవ్యాధిని అదృశ్య శుత్రువుగా పేర్కొంటారు. ఒక కంటికి కానీ, రెండు కళ్లకి ఈవ్యాధి వచ్చే అవకాశాలున్నాయి.
మీపరిధీయ దృష్టి నష్టం(పక్క చూపు తగ్గడం) క్రమంగా మొదలై, కొన్ని సంవత్సరాల్లో పూర్తి చూపు కోల్పోయే ప్రమాదముంది. కంటిలో, కంటి చుట్టూ నొప్పి రావచ్చు. హఠాత్తుగా కన్ను ఎర్రబడటంతో పాటు తలనొప్పి, కన్ను నొప్పి ఉంటుంది.

గ్లకోమా అని ఎలా నిర్దారణ:

పై లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలో ఉన్న కంటి వైద్యులను సంప్రదించాలి. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి. ఈపరీక్షల్లో మీకంటి చూపు, కంటిలోని ఒత్తిడి, దృష్టి నాడి స్దితిని పరీక్షలు చేస్తారు. కంటి వైద్యునికి మీకు గ్లకోమా ఉన్నట్లు అనిపిస్తే నిర్దారిత పరీక్షల కొన్ని ఓసిటి, దృష్టి క్షేత్రపరీక్షా చేయిస్తారు. వీటి ద్వారా ఏరకమైన గ్లకోమా ఉందో నిర్దారించి, చికిత్స విధానం నిర్ణయిస్తారు.

గ్లకోమాకు చికిత్స: గ్లకోమా వ్యాధికి మొదటి చుక్కల మందులు, లేజర్ వంటివి చేసి కంటిలోని ఒత్తిడిని తగ్గించడానికి, నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. లేసర్, చుక్కల మందులతో ఒత్తిడి తగ్గకపోతే శస్త్ర చికిత్స చేయాల్సి వస్తుందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. చాలామంది ఈవ్యాధి గురించి సరైన అవగాహన లేకపోవడంతో తమ చూపు కోల్పోతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు సూచనలు పాటించి ఆరోగ్యం కాపాడుకోవాలని సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News