Thursday, January 23, 2025

జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీల్లో స్వర్ణం సాధించిన రిత్విక

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ స్పోర్ట్ : 33వ జూనియర్ అండ్ సబ్ జూనియర్ సౌత్ జోన్ యాక్వటిక్ ఛాంపియన్‌షిప్ 2022 కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో జరుగుచున్న జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలలో మన తెలంగాణ రాష్ట్రం తరపున నిజామాబాద్ జిల్లాకు చెందిన మిట్టపల్లి రిత్విక గ్రూప్1 విభాగంలో పాల్గొని 50 మీటర్ల బెస్ట్ స్ట్రోక్‌లో (00:35:91) బంగారు పతకం సాధించి గత 2017 నుండి కర్ణాటకకు చెందిన క్రీడాకారిణి సోలోని దలల్ (00ః36ః84) పేరు మీద ఉన్న రికార్డుని బద్దలు కొట్టి రిత్విక కొత్త రికార్డును నెలకొల్పింది.

ఈ ఘన విజయం సాధించిన రిత్వికను తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి రామకృష్ణ మరియు స్విమ్మింగ్ కోచ్ జాన్‌సిద్దిక్, అలాగే జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు మరియు స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గడీల శ్రీరాములు, మహిపాల్‌రెడ్డి అలాగే ఆల్ ఇండియా వెల్మ సంఘం అధ్యక్షులు పాపారావు మరియు ఉపాధ్యక్షులు శ్రీనివాసరావు, దివాకర్‌రావు అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News