న్యూఢిల్లీ : దేశంలో నదుల అనుసంధాన ప్రాజెక్టులతో లాభం కన్నా పూడ్చలేని నష్టాలే ఎక్కువ అని ఓ అధ్యయనంలో వెల్లడైంది. కరువుకాటకాలను ఎదుర్కొనేందుకు నదుల అనుసంధానం మార్గమని పేర్కొంటూ అనుసంధాన ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా తలపెట్టారు. అయితే దీని వల్ల నీటి సమస్య మరింత జటిలం అవుతుంది. పైగా రుతుపవనాల దిశలపై వాటి ఫలితాలపై ప్రభావం పడుతుందని వెల్లడైన అధ్యయన వివరాలు ఇప్పుడు జర్నల్ నేచర్‌లో ప్రచురించారు. ఐఐటి బొంబాయి, ఐఐటిఎం పుణే వంటి పలు సంస్తలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రాంతీయ క్లైమెట్ పద్ధతులు, రి అనాలిసిస్ డేటా వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని అధ్యయనం జరిగింది. నదుల అనుసంధాన ప్రక్రియ భారీ స్థాయిలో సాగితే ఇకపై నదీ పరివాహక ప్రాంతాలలో ఉండే నేల తేమ శాతం అంతరించి పోతూ , దీని ప్రభావం రుతుపవనాల కదలికపై పడుతుంది. ఇది వర్షాల ఆగమనాన్ని ప్రభావితం చేస్తుందని విశ్లేషించారు.
నదుల లింక్‌తో నీటి సమస్య జటిలం
- Advertisement -
- Advertisement -
- Advertisement -