హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ సందర్భంగా క్రికెట్ లవర్స్ కు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్‌తో టిమిండియా జూన 5న తలపడనుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా రియాన్ పరాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్‌లో టాప్-4లో ఎవరు ఉంటారు అనేదానిపై చర్చ జరుగుతోందని, తాను టీమిండియా టీమ్‌లో ఉంటే చెప్పేవాడినని వివరణ ఇచ్చాడు. టాప్-4 జట్ల గురించి చెబితే కొన్ని టీమ్ లపై పక్షపాతం చూపించినట్టుగా ఉంటుందన్నారు.
ఈ సారి టి20 వరల్డ్ కప్ చూడానని, ఎవరు గెలుస్తారనేది మాత్రం చూస్తానని పేర్కొన్నారు. తాను వర్డల్ కప్ జట్టులో ఉండుంటే ఏమవుతోందని ఆలోచించేవాడినని, ఇప్పుడు జట్టులో లేను కాబట్టి ఆసక్తి లేదన్నారు. మైదానంలో విరాట్ కోహ్లీ చూపించే జోష్‌ను ఎవరూ అందుకోలేరని రియన్ పరాగ్ తెలియజేశారు. ఐపిఎల్ 2024లో రియాన్ పరాగ్ 573 పరుగులు చేసి మూడో బ్యాట్స్‌మెన్‌గా రికార్డులో ఉన్నాడు. ఈ ఐపిఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి అత్యధిక పరుగులు చేసిన రికార్డు పరాగ్ ఖాతాలో చేరింది. పరాగ్ తరువాత సంజూ శామ్సన్ 531 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. గతంలో ఇలాంటి వ్యాఖ్యలతో ట్రోలింగ్‌కు గురయ్యాడు.