Thursday, December 19, 2024

రిజ్వాన్‌కు టాప్ ర్యాంక్..

- Advertisement -
- Advertisement -

Rizwan Climbs Top in ICC T20I Rankings

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఆసియాకప్‌లో అసాధారణ బ్యాటింగ్‌ను కనబరుస్తున్న రిజ్వాన్ తాజా ర్యాంకింగ్స్‌లో 815 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో టాప్ ర్యాంక్‌లో ఉన్న పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను రెండో స్థానానికి నెట్టాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్‌క్రామ్ మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. భారత యువ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. బౌలింగ్ విభాగంలో హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా) టాప్ ర్యాంక్‌లో నిలిచాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో మహ్మద్ నబి (అఫ్గాన్) మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు.

Rizwan Climbs Top in ICC T20I Rankings

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News