Tuesday, December 3, 2024

ప్లీజ్ పాకిస్తాన్ కు రండి.. టీమిండియాకు రిజ్వాన్ రిక్వెస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఎడిషన్ పాకిస్థాన్ వేదికగా జరగనుంది. ఫిబ్రవరి 19న ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ టోర్నీ మ్యాచ్ లు నిర్వహించేందుకు లాహోర్, కరాచీ, రావల్పిండి స్టేడియాలను ఎంపిక చేసిన పిసిబి..వాటిని పునరుద్దరిస్తున్నారు. ఏర్పాట్లపై పిసిబి చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇటీవల ఐసీసీకి తెలిపారు. అయితే, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత్ పాకిస్థాన్‌కు వెళుతుందా? అనే ప్రశ్న సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త రాజకీయ సంబంధాల కారణంగా 2008 జూలై నుంచి భారత్ క్రికెట్ జట్టును పాకిస్థాన్‌కు వెళ్లడం లేదు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా, పాక్ కు వెళ్లుందా? లేదా? అని చర్చ జరుగుతోంది. అయితే, తాము పాకిస్థాన్ వెళ్లేది లేదని, ఈ టోర్నీలో భారత్ ఆడే స్టేడియాలను మార్చాలంటూ బిసిసిఐ, ఐసిసిని కోరినట్లు సమాచారం.

అయితే, ఈ మెగా టోర్నమెంట్ కోసం భారత్ పాకిస్థాన్‌కు రావాలని కోరుకుంటున్నానని, వారు ఇక్కడ పర్యటించాలని రిక్వెస్ట్ చేస్తున్నానని పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ తెలిపాడు. “పాకిస్తాన్ అభిమానులు భారత ఆటగాళ్లను ప్రేమిస్తారు. మేము భారతదేశంలో కూడా(2023 ప్రపంచ కప్ సమయంలో) ప్రేమను అందుకున్నాము. భారత్ కూడా పాకిస్తాన్‌కు వచ్చి ఇక్కడ ఆడాలని మేము కోరుకుంటున్నాము. వారు ఛాంపియన్స్ ట్రోఫీకి వస్తారో లేదో నాకు తెలియదు. కానీ ఒక విషయం ఖచ్చితంగా చెప్పగలను. వారు వచ్చినట్లయితే, ఇక్కడ అద్భుతమైన స్వాగతం పొందుతారు” అని రిజ్వాన్ పేర్కొన్నాడు. కాగా, ఇటీవల బాబర్ అజామ్ స్థానంలో మహ్మద్‌ రిజ్వాన్‌ పాక్ వన్డే, టీ20 కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News