Monday, December 23, 2024

సిబిఐకి వ్యతిరేకంగా ఆర్జేడీ ఆందోళనలు..

- Advertisement -
- Advertisement -

RJD concerns against CBI

కార్యకర్తలను వారించిన రబ్రీదేవి

పాట్నా : బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలా ప్రసాద్ యాదవ్‌పై అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయన నివాసంపై సిబిఐ దాడులు నిర్వహించింది. అయితే సోదాలు జరుగుతోన్న ప్రాంతానికి చేరుకున్న ఆర్జేడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇదంతా బీజేపీ కుట్రగా నినాదాలు చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్తోన్న సీబీఐ అధికారులను కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో లాలూ సతీమణి రబ్రీదేవి కార్యకర్తలను వారించి తప్పుకోవాలని మందలించారు. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైతన ఆమె .. పలువురు కార్యకర్తలపై చేయి చేసుకున్నారు.

శుక్రవారం ఉదయం నుంచి లాలూకు సంబంధించిన 15 చోట్ల సీబీఐ సోదాలు చేపట్టింది. పాట్నాలో రబ్రీదేవిని 12 గంటల పాటు విచారించినట్టు సమాచారం. 2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఎ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. 2008 లో జరిగిన రైల్వే నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి కుటుంబాల నుంచి లాలూ కుటుంబం భూములు , ఆస్తులు లంచంగా తీసుకుంటుందని సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News