Saturday, December 21, 2024

కోటాతో లిప్‌స్టిక్ ఆడాళ్లకే మరింత లిఫ్టు

- Advertisement -
- Advertisement -

పాట్నా : లిప్‌స్టిక్ పెదాలు, బాబ్డ్ కట్ జుట్టు బాపతు ఆడవారే ఇప్పుడు వచ్చిన మహిళా బిల్లుతో మరింత ముందుకు దూసుకుపోతారని ఆర్జేడీ సీనియర్ నేత అబ్దుల్ బారీ సిద్ధిఖీ వ్యాఖ్యానించారు. ఈ మాటలు తీవ్రవివాదానికి దారితీశాయి. ఇటీవలే పార్లమెంట్‌లో మహిళా బిల్లు ఆమోదం పొందింది. ఇప్పుడు చట్టం అయింది. దీనితో చట్టసభలలో మహిళలకు 33 శాతం సీట్లు దక్కే అవకాశం ఏర్పడింది. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో సిద్ధిఖీ మాట్లాడారు. తమ పార్టీ ఆది నుంచి బిల్లుకు మద్దతు ప్రకటిస్తూనే ఉందని, అయితే ఇప్పుడున్న రూపంలో మహిళా బిల్లు సమ్మతం కాదనేది లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వపు ఆర్జేడీ వాదనగా ఉంది. మహిళా కోటాలో ఒబిసి మహిళా కోటా ఉండాలని ఆర్జేడీ, ఎస్‌పి ఇతర కొన్ని పార్టీలు కోరుతున్నాయి.

ఈ బిల్లుతో ఏ వర్గపు మహిళ లాభం పొందుతుందనేది సభికులకు తెలియచేయడానికి తాను నాటు పల్లెటూరి భాషలో చెప్పాల్సివచ్చిందని ఈ నేత తెలిపారు. ఇక్కడ ఈ నేత ప్రసంగించిన ఆర్జేడీ ర్యాలీలో అత్యధిక సంఖ్యలో గ్రామీణ మహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల కోటా చట్టంతో ఎవరికి లాభం అందుతుందనేది ఊరి ఆడవారు అర్థం చేసుకోవాలని తెలిపారు. హై క్లాసు మహిళలు, ష్యాషన్‌బుల్ తరగతి వారికే ఈ బిల్లు విసనకర్ర అవుతుందన్నారు. వీరే మరింత ఎక్కువ సంఖ్యలో చట్టసభలలో తమ ప్రాబల్యం చాటుకుంటారని తెలిపారు. మట్టి మనుష్యులైన ఆడవారిని ఈ బిల్లు అంటరానివారినే చేస్తుందన్నారు. ఇది తన ఆవేదన అన్నారు.

ఆర్జేడీ నేత అల్పబుద్ధి ః బిజెపి నేత కౌశల్
ఆర్జేడీ నేత సిద్ధిఖీ వ్యాఖ్యలు ఆ పార్టీ అల్పత్వాన్ని చాటిచెపుతున్నాయని కేంద్ర మంత్రి , బిజెపి నేత కౌశల్ కిశోర్ విమర్శించారు. ఇది సంకుచిత వైఖరికి పరాకాష్ట అన్నారు. చట్టసభలకు వచ్చే వారికి రాజ్యాంగం పట్ల అవగావహన వస్తుంది. చట్టాలు గురించి తెలిసివస్తుంది. ఎవరిని తక్కువ అంచనా వేయరాదని, అంతా కలిసికట్టుగా వ్యవహరిస్తేనే ప్రజా ప్రయోజనాల పనులు చేయడానికి వీలేర్పడుతుందని అన్నారు. ఆర్జేడీ తిరోగమనవాదం ఇప్పుడు ఈ నేత మాటలతో తేలిందని వ్యాఖ్యానించారు. కాగా సిద్ధిఖీ స్పందనపై ఇండియా కూటమికే చెందిన జెఎంఎం నుంచి కూడా విమర్శలకు దారితీసింది. పార్టీకి చెందిన ఎంపి మహూవా మాజీ స్పందిస్తూ మహిళలను కించపరిచే వ్యాఖ్యలకు దిగడం తగదని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News