Monday, December 23, 2024

పార్లమెంటు నూతన భవనంపై ఆర్‌జెడి వివాదాస్పద ట్వీట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అట్టహాసంగా ప్రారంభించిన పార్లమెంటు భవనంపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్‌జెడి చేసిన ట్వీట్ పెనుదుమారానికి దారి తీసింది. కొత్త పార్లమెంటు భవనాన్ని శవపేటికతో పోలుస్తూ ఆ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ భవనం శవపేటికలా సమాధి చేసిన ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, దీన్ని దేశం అంగీకరించదంటూ బిజెపిని విమర్శిస్తూ ఆ పార్టీ ట్వీట్ చేసింది.

వాస్తవానికి పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం అని,చర్చల వేదిక, కానీ బిజెపి దాన్ని అవమానపర్చి ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసిందని ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేసింది. ఈ ట్వీట్‌పై బిజెపి నేత సుశీల్ మోడీ స్పందిస్తూ పార్లమెంటు కొత్త భవనాన్నిశవపేటికతో పోల్చిన వారిపై దేశద్రోహం కేసు పెట్టాలని మండిపడ్డారు. మరో బిజెపి నేత దుష్యంత్ గౌతమ్ ఇలాంటివ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. కొత్త పారల్మెంటును శవపేటికతో పోల్లాచరు, పాత పార్లమెంటును జీరోతో పోల్చారా? ఎందుకంటే అప్పుడు మనం జీరోలాగానే కూర్చున్నాం కదా అంటూ చురకలు వేశారు. పలువురు బిజెపి నేతలు కూడా ఆర్‌జెడి ట్వీట్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News