Sunday, December 22, 2024

షర్మిలకు షాక్.. మళ్లీ వైసీపీలోకి ఆర్కే?

- Advertisement -
- Advertisement -

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మళ్లీ వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మంగళగిరి నియోజకవర్గంనుంచి వైఎస్సార్ సీపీ టికెట్ పై పోటీచేసి, టిడిపి యువ నేత నారా  లోకేశ్ పై గెలిచిన ఆర్కే, తనకు మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఆశించారు. పదవి దక్కకపోగా, తన నియోజకవర్గానికి నిధుల కేటాయింపులోనూ మొండిచెయ్యి చూపించడంతో మనస్తాపం చెంది, పార్టీకి  రాజీనామా చేశారు. వైఎస్ షర్మిల పిసిసి పగ్గాలు చేపట్టగానే ముందుగా ఆ పార్టీలో చేరింది ఆర్కేయే.

అయితే ఇప్పుడు మళ్లీ ఆర్కే మనసు మారినట్లు తెలుస్తోంది. కీలకమైన మంగళగిరి నియోజకవర్గంలో గెలవాలంటే ఆర్కే మద్దతు తప్పనిసరి అని ఆలస్యంగానైనా గ్రహించిన వైఎస్సార్ సీపీ అగ్రనేతలు ఆర్కేను  బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఈమేరకు కాస్త మెత్తబడిన ఆర్కే… మంగళవారం విజయసాయిరెడ్డితోనూ, ఆ తర్వాత సిఎం జగన్ తోనూ భేటీ కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News