Sunday, January 19, 2025

మళ్లీ వైఎస్సార్ సీపీ గూటికి ఆళ్ల

- Advertisement -
- Advertisement -

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తిరిగి వైఎస్సార్ సీపీ గూటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మంగళవారం ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ వైఖరికి నిరసనగా ఆర్కే డిసెంబర్లో పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలిగా పదవి చేపట్టాక, ఆ పార్టీలో చేరారు.

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఆళ్లను వెనక్కి రప్పించాలని వైఎస్సార్ సీపీ అధిష్ఠానం భావించింది. ఈమేరకు ఆర్కేతో ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి. ఇద్దరూ కలసి మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రిని కలిశారు. పార్టీలో చేరేందుకు ఆర్కే సుముఖత వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News