ఎపిఒఎ కార్యదర్శి పురుషోత్తం
మన తెలంగాణ/హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో ఉన్న ఒలింపిక్ భవన్‌పై తమ హక్కు కూడా ఉందని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఎపిఒఎ) ప్రధాన కార్యదర్శి ఆర్.కె.పురుషోత్తం తెలిపారు. మంళవారం ఆయన ఫతే మైదాన్ క్లబ్‌లో ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒలింపిక్ భవన్‌లో ఎపిఒఎకు హక్కు ఉందన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘంలో వివాదాలు ఉండడంతో ఇప్పటి వరకు తాము తమ వాటా గురించి అడగలేదన్నారు. ఇప్పుడు ఎపిఒఎలో విదాదాలు పరిష్కారమవడంతో తమ వంతు వాటా కోసం పోరాడుతామన్నారు. సాధ్యమైనంత త్వరగా తమకు రావాల్సిన వాటాను అందజేశాలని తెలంగాణ ఒలింపిక్ సంఘంను కోరారు. ఒలింపిక్ భవన్‌ను పూర్తిగా ఎపిఒఎ నిధులతో మాత్రమే నిర్మించామన్నారు. దీంతో ఒలింపిక్ భవన్‌పై తమకు కూడా సమాన హక్కులు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక తమకు రావాల్సిన వాటా గురించి తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శికి వినతి పత్రాన్ని కూడా అందజేసినట్టు పురుషోత్తం వివరించారు.