Saturday, January 11, 2025

కూటమి ప్రభుత్వంపై వైసిపి మాజీ మంత్రి రోజా ఫైర్

- Advertisement -
- Advertisement -

హిందూవులంటే చంద్రబాబుకు గౌరవం లేదా అని వైసిపి మాజీ మంత్రి ఆర్ కె రోజా ఆరోపణలు చేశారు. తిరుమల తొక్కిసలాటతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్న సిఎం, డిప్యూటీ సిఎంకు బుద్ధిరాలేదని అన్నారు. చంద్రబాబు తన మనుషులను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, భక్తుల మీద ప్రేమ, అనుభవం లేనివారికి పదవులు ఇస్తున్నారని రోజా వ్యాఖ్యనించారు. వెంకయ్య ‘ చౌదరి’ కావడాన్నే పదవి ఇచ్చారా…? తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయినా చంద్రబాబు మేల్కో లేదని,  తిరుపతి తొక్కిసలాటలో మొదటి ముద్దాయి చంద్రబాబు అనే ఆమె అన్నారు.

సరైన సంఖ్యలో పోలీసులను పెడితే తొక్కిసలాట జరిగేది కాదని, ఈ హత్యలు కూటమి ప్రభుత్వం చంద్రబాబు చేసినవేనని, లక్షల సంఖ్యలో భక్తులు వస్తారని మీకు తెలియదా? మద్యం పాలసీని మారుస్తారు కానీ టోకెన్ సిస్టం ను మార్చరా…?  అని ప్రశ్నిచారు. తొక్కిసలాటకు బాధ్యులైన వారిపై ఎఫ్ఐఆర్ ఎందుకు బుక్ చేయలేదు? అని రోజా మండిపడ్డారు. తొక్కిసలాటకు కారణమైన వారి తోలు ఎందుకు పవన్ తీయడం లేదు…? చౌదరి, బిఆర్ నాయుడ్ని శిక్షించడానికి పవన్ ఎందుకు భయపడుతున్నారని, కులం చూసి భయపడను అనే పవన్ ఇప్పడెందుకు భయపడుతున్నారు.

ఎస్పీ, టిటిడి పాలక మండలితో సహా అందరీపై కేసులు పెట్టాలని తిరుపతి తొక్కిసలాటను కోర్టులు సుమోటో తీసుకోవాలని తెలిపారు.  తొక్కిసలాట తరువాత భక్తులు భయపడి దైవ దర్శనానికి కూడా రాలేదని, హిందూత్వాన్ని, మన దేవుళ్లను కాపాడుకోవడానికి స్వామిజీలు ఉన్నారన్నారు. పిఠాపురంలో మణికంఠ, చరణ్ కుటుంబాలను పవన్ ఎందుకు పరామర్శించలేదని వైసిపి మాజి మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.  చెప్పాల్సింది క్షమాపణలు కాదు..బాధ్యులను శిక్షించాలన్నారు. టిటిడి ఛైర్మన్, ఈవో, జేఈవో తప్పు చేశారని పవనే చెప్తున్నారని రోజా స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News