Friday, November 22, 2024

ఆర్‌ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి ఓటు వేయలేదు : జేపీ నడ్డా

- Advertisement -
- Advertisement -

RLD chief Jayant Chaudhary did not vote: JP Nadda

లక్నో : ఉత్తరన్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌లోఆర్‌ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి ఓటు వేయలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా విమర్శించారు. ఇది వారి దురహంకారాన్ని తెలియచేస్తుందని ఆరోపించారు. ఇలాంటి వారికి ప్రజాస్వామ్యశక్తి సమాధానం ఇస్తుందని వ్యాఖ్యానించారు. యూపీ లోని బిస్వాన్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎస్పీఆఎల్డీ కూటమితోపాటు కాంగ్రెస్ పార్టీపై జీపీ నడ్డా మండిపడ్డారు. కేవలం బీజేపీ మాత్రమే జాతీయ పార్టీగా మిగిలి ఉంటుందన్నారు. ఇతర పార్టీలన్నీ రాజవంశాల పార్టీలుగా మారాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయంగా లేదా భారతీయంగా కూడా మిగలలేదని ఎద్దేవా చేవారు. అది ఒక ప్రాంతీయ పార్టీ గాను, సోదరసోదరీమణుల పార్టీగా మారిందన్నారు. ఉత్తరప్రదేశ్‌ను అల్లర్లు, మాఫియా , తీవ్రవాద రహితంగా ఉంచుతామని తెలిపారు. దేవ్‌బంద్, మీరట్, రాంపూర్, అజంగఢ్, కాన్పూర్, బహ్రైచ్‌లలో యాంటీ టెర్రరిస్ట్ కమాండో కేంద్రాలు నిర్మిస్తామని చెప్పారు. అఖిలేశ్ ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో 200 అల్లర్లు జరిగాయని, యోగి హయాంలో ఎలాంటి అల్లర్లు జరగలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News