హైదారబాద్: జర్మన్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్(డ్యాట్షీ జెసెల్‌షాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసామ్మెర్బీట్) (జీఐజెడ్) జీఎంబీహెచ్, ఆర్‌ఎల్‌జీ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లు భాగస్వామ్యం చేసుకుని మూడు సంవత్సరాల కాల వ్యవధి కలిగిన ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం ‘ఈ–వ్యర్థ నిర్వహణ కోసం వినూత్నమైన విలువ చైన్ ఏర్పాటుచేయడం’ శీర్షికన ఓ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాయి. ఈ ప్రాజెక్ట్‌నే ఈ–సఫాయీ అని కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను డెవలప్ పీపీపీ ప్రోగ్రామ్ ద్వారా ఫండింగ్ చేశారు. జర్మన్ ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(బీఎంజెడ్) తరపున జీఐజెడ్ దీనిని అమలు చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమ ప్రధాన లక్ష్యం సురక్షితంగా, స్ధిరంగా ఈ–వ్యర్ధాలను నిర్వహించడం పట్ల పాఠశాలలు, రిటైలర్లు, బల్క్ వినియోగదారులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు తదితర వాటాదారుల నడుమ అవగాహన కల్పించడం.
దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వ్యర్థాలలో ఈ–వ్యర్థాలు కూడా ఉన్నాయి. తగిన రీతిలో ఈ–వ్యర్ధాలను నాశనం చేయకపోవడం వల్ల కాడ్మియం, సీసం, క్రోమియం, మెర్క్యురీ తో పాటుగా అరుదైన లోహాలైనటువంటి బంగారం, వెండి, పల్లాడియం సైతం విడుదలవుతుంటాయి. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఈ–వ్యర్ధాలను ప్రధానంగా అసంఘటిత రంగంలో నిర్వహిస్తుంటారు. జీటీజెడ్–మైట్ నిర్వహించిన అధ్యయనంలో కేవలం 5% ఈ–వ్యర్థాలు మాత్రమే సంఘటిత రంగంలో ఉంటే, 95% అసంఘటిత రంగంలోనే సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్ట్యువల్ వర్క్‌షాప్‌ను నిర్వహించడం ద్వారా బాధ్యతలు, విధులను గురించి వెల్లడించడం జరిగింది.
ఆర్‌ఎల్‌జీ సిస్టమ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రాధికా కాలియా మాట్లాడుతూ.. ‘‘భారతదేశంలో ఈ–వ్యర్ధాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ–వ్యర్ధాల నిర్వహణ పట్ల అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. కార్పోరేట్ కంపెనీలు/బల్క్ వినియోగదారులు ఖచ్చితంగా తగిన ఈ–వ్యర్ధ నిర్వహణ విధానం అనుసరించాల్సి ఉంది. ఆర్‌ఎల్‌జీ వద్ద తాము వాటాదారులందరితోనూ కలిసి పనిచేస్తూ వారి బాధ్యతలు తెలుపుతున్నాము’’ అని అన్నారు.
RLG Systems and GIZ India launches E-Safai Program